ధోనీని చూసి నేర్చుకో ఆర్పీ సింగ్.. అభిమానికి మిడిల్ ఫింగర్ చూపిస్తావా?
ముంబైలో ఇండియా-ఏ, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆట మధ్యలో ధోనీ అభిమాని ఒకరు... స్టాండ్స్ నుంచి దూకి, పిచ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వె
ముంబైలో ఇండియా-ఏ, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆట మధ్యలో ధోనీ అభిమాని ఒకరు... స్టాండ్స్ నుంచి దూకి, పిచ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది, అతన్ని పట్టుకునేందుకు పరిగెత్తుతూ వచ్చారు. అయితే, తనకు కొంచెం దూరం వరకు వచ్చిన అభిమానిని దగ్గరకు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ధోనీ. దీంతో ఎంతో సంతోషానికి గురైన అతను, ధోనీ కాళ్లను టచ్ చేశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది అతడిని తీసుకుని గ్రౌండ్ వెలుపలకు తీసుకుపోయారు.
అయితే రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబైపై గుజరాత్ జట్టు ఘనవిజయం సాధించింది. జట్టువిజయంలో కెప్టెన్ పార్థివ్ పటేల్‌తో పాటు, పేస్ బౌలర్ ఆర్పీసింగ్ ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే ఆర్పీ సింగ్ ఊహించని కారణాలతో వార్తల్లో నిలిచాడు. మూడో రోజు ఆట జరుగుతుండగా ఆర్పీ సింగ్ ఒక అభిమానికి తన మిడిల్ ఫింగర్ చూపించాడంటూ వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదాస్పద వీడియో బయటకొచ్చింది. బౌండరీ లైన్ దాటి ఒక అభిమాని వద్దకు వెళ్లిన ఆర్పీ సింగ్ ఫోన్ లాక్కొని గ్రౌండ్‌లోకి విసిరేశాడు. అయితే ఆర్పీ సింగ్ ఎందుకు, ఎప్పుడు చేశాడు, సదరు అభిమాని ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడనేది మాత్రం తెలియలేదు. ఆర్పీ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 300 వికెట్లు తీశాడు. టీమిండియా తరుపున 14 టెస్ట్‌లు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ధోనీ సారధ్యంలో భారత జట్టు టీట్వంటీ కప్ నెగ్గిన జట్టులో ఆర్పీ సింగ్ ప్రముఖ పాత్ర పోషించాడు.