1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Strong system, strong results Shoaib Akhtar reacts to India’s 96-run final statement

భారత్ పాలసీ గెలిచింది. సిస్టమ్ గెలిచింది.. సంజూ కోసం గంభీర్ పోరాడాడు.. అక్తర్

Akthar
Akthar
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. టీమిండియా క్రికెటర్లపై ప్రశంసించాడు. ప్రపంచకప్ 2026 గెలుచుకున్న భారత్‌‌ గెలవడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాలసీ గెలిచింది. సిస్టమ్ గెలిచింది.. అంటూ కొనియాడాడు. మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసినందుకు గౌతమ్ గంభీర్‌ను కూడా ప్రశంసించాడు. అంతేకాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి గౌరవం ఇస్తూ ముగ్గురు కెప్టెన్లు కలిసి సెలబ్రేట్ చేయడం గొప్ప విషయమని కొనియాడాడు. ప్రపంచ కప్ ఫైనల్ నేపథ్యంలో పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న అక్తర్.. సంజూ శాంసన్ ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 
సంజూ శాంసన్ 2014 నుంచి భారత క్రికెట్‌లో ఉన్నాడు. కానీ ధోనీ, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్ వంటి వికెట్ కీపర్ల కారణంగా అతనికి భారత జట్టులో అవకాశం దక్కలేదు. గంభీర్ సంజూ శాంసన్ ఎంపిక కోసం చాలా పోరాడాల్సి వచ్చింది. ప్రపంచకప్ ఆరంభంలో భారత తుది జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదని అక్తర్ పేర్కొన్నాడు. 
 
అయితే సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లో భారత ఓడిపోవడం.. ఆఫ్ స్పిన్నర్లకు భారత లెఫ్టార్మ్ ఓపెనర్లు ఇబ్బంది పడటంతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజూను ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో వెస్టిండీస్‌తో చావో రేవో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను ఆడించగా.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌ (97 నాటౌట్)తో భారత్‌కు విజయాన్నందించాడు. ఇంగ్లండ్‌తోనూ 89 పరుగులు చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 
 
ఈ టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సంజూ శాంసన్ 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో 232 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(15 సిక్స్‌లు) రికార్డ్‌ను అధిగమించాడు.
తర్వాతి కథనం
శివమ్ దూబే బ్యాట్‌తో న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టిన అభిషేక్ శర్మ...