జిమ్‌లో పంజాబీ పాటకు కాలు కదిపిన విరాట్ కోహ్లీ, అనుష్క
స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. జిమ్‌లో పంజాబీ పాటకు కాలు కదిపింది.
అయితే కొన్ని సెకన్లకే కాలు పట్టేయడంతో కోహ్లీ పక్కకు వెళ్లిపోగా.. అనుష్క మాత్రం డ్యాన్స్ ఇరగదీసింది. వీడియో ఆఫ్ ద డే అంటూ కోహ్లీ, అనుష్క డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫు ఐపీఎల్ 16వ సీజన్ లో బిజీగా ఉన్నాడు. అనుష్క పలు మ్యాచ్ లకు హాజరై స్టేడియంలో సందడి చేస్తోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.