ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (18:05 IST)

చాక్లెట్ యాడ్ కోసం గెటప్ మార్చిన ధోనీ..

చాక్లెట్ యాడ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. కెరీర్ ప్రారంభంలో జుట్టు బాగా పెంచుకుని ఎలా కనిపించాడో.. అదే తరహా జుట్టుతో కొట్ట గెటప్‌లో ధోనీ దర్శనమిచ్చాడు. వాణిజ్

చాక్లెట్ యాడ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. కెరీర్ ప్రారంభంలో జుట్టు బాగా పెంచుకుని ఎలా కనిపించాడో.. అదే తరహా జుట్టుతో కొట్ట గెటప్‌లో ధోనీ దర్శనమిచ్చాడు. వాణిజ్య ప్రకటనల్లో రారాజుగా వుండిన ధోనీ జోరు కొంతకాలంగా తగ్గింది. విరాట్ కోహ్లీ ధోనీ అవకాశాలను కొల్లగొట్టుకుంటున్నాడు. 
 
అయినప్పటికీ కొన్ని కంపెనీలు ధోనీని తమ యాడ్‌లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ క్రమంలో చాక్లెట్ యాడ్‌లో నటించాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ గెటప్ బాగుందంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు. శ్రీలంకలో రేపటి నుంచి జరగనున్న ముక్కోణపు సిరీస్ నుంచి అతనికి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.