శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (08:46 IST)

వాళ్లను నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలి : యోగీశ్వర్ దత్

కాశ్మీర్‌లో దేశ సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలని భారత కుస్తీ యోధుడు, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ఉప ఎన్నికల బందోబస్తు

కాశ్మీర్‌లో దేశ సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలని భారత కుస్తీ యోధుడు, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ఉప ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన సైనికుల పట్ల కొంతమంది కాశ్మీర్ యువత దుర్మార్గంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై యోగీశ్వర్ ఈ వ్యాఖ్య చేశారు. అసాంఘిక శక్తుల అదుపు చేయడానికి సైనిక దళాలకు పూర్తి అధికారాలు ఇవ్వాలని అన్నారు. 
 
అలాగే, క్రికెటర్ గౌతం గంభీర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. స్వాతంత్ర్యం కావాలనుకునేవారు దేశం వీడి వెళ్లిపోవాలనీ, కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమంటూ ఇటీవల ట్వీట్ చేశారు. కాగా, సైనికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన కాశ్మీర్ యువత పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.