బుధవారం, 9 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (08:19 IST)

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

Navy officer Murder case
తన భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేసి జైలులో బంధించారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఆమెకు వైద్య పరీక్షలు చేయగా గర్భందాల్చినట్టు నిర్ధారణ అయింది. భర్త విదేశాల్లో ఉండేవాడు. కుమార్తె పుట్టిన రోజు వేడుకలకంటూ స్వదేశానికి వచ్చి హత్యకు గురయ్యాడు. కానీ, అతని భార్య మాత్రం గర్భందాల్చింది. ఈ ట్విస్ట్ మర్చంట్ నేవీ అధికారి కేసులో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తి మర్చంట్ నేవీ అధికారిగా పని చేశారు. ఆయన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చివరకు ఆమె, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఈ హత్య కేసు దేశంలో సంచలనంగా మారింది. తాజాగా సౌరభ్ హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. 
 
ఈ హత్యకేసులో మృతుడు భార్య ముస్కాన్ రస్తోగి జైలులో ఉంటున్నారు. ఆమెకు జైలు అధికారులు వైద్య పరీక్షలు చేయించగా, అందులో ఆమె గర్భందాల్చినట్టు తేలింది. దీంతో సౌరభ్ హత్య కేసులో ఈ విషయం ఇపకుడు చర్చనీయాంశంగా మారింది. 
 
సౌరభ్ రాజ్‌పుత్‌కు -  ముస్కాన్‌కు గత 2016లో వివారం కాగా, 2019లో ఓ కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్ (25) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో సౌరభ్ నేవీలో ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లిపోయి ఓ బేకరీలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం కుమార్తె పుట్టినరోజు వేడుకలకు వచ్చి భార్య, ఆమె ప్రియుడు చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని 15 ముక్కలు చేసి శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డమ్ములో ఉంచి పైన సిమెంట్‌తో కప్పేశారు. 
 
పైగా, భర్త సంపాదనంతా ప్రియుడు సాహిల్‌కు ఇచ్చి ఆన్‌లైన్ బెట్టింగులు ఆడించి, ఆ వచ్చిన సొమ్ముతో విహారయాత్రలకు వెళ్లినట్టు తేలింది. ఈ కేసులో రస్తోగి, సాహిల్‌లు అరెస్టు చేసి జైలులో ఉంచిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఆహారపదార్థాలు మానేసిన ఈ వీరిద్దరూ డ్రగ్స్‌‍కు అలవాటుపడ్డారు. ఇపుడు జైలులో కూడా తమకు ఆహారం వద్దంటూ డ్రగ్స్ కోవాలంటా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రస్తోగి గర్భందాల్చిన వార్త సంచలనంగా మారింది. దానికి ఆమె ప్రియుడు సాహిల్ కారణమైవుంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు.