1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (09:48 IST)

బీపీ మాత్రలు మింగి ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య ... ఎందుకో తెలుసా?

suicide
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే మహిళా కండక్టర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె నిద్రమాత్రలు అధికంగా తీసుకుని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్‌లో జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఎల్బీ నగర్‌కు చెందిన గంజి శ్రీవిద్య (48) అనే మహిళ గత 12 సంత్సరాలుగా బండ్లగూడ డిపోలో ఆర్టీసీ కండక్టరుగా పని చేస్తున్నారు. అయితే, విధుల్లో తప్పు చేయడం వల్ల ఆమెను ఈ నెల 12వ తేదీన ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 
 
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. నిద్రమాత్రలను అధిక మోతాదులో మింగడంతో అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎల్బీ నగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కు మరో షాక్ : పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్సీ  
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలాఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించి, ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. నామినేషన్ల సమయం సమీపిస్తుండటంతో ఆ పార్టీలోని అసంతృప్త కొందరు పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత భారత రాష్ట్ర సమితి పార్టీకి టాటా చెప్పేశారు. అలాగే, తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. 
 
బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యే ప్రభుత్వంగా పరిపాలన సాగుతుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానస పాలనగా మారందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు బాధ వర్ణనాతీతంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నీ తనను బాధకు గురి చేశాయని, అందుకే ఆ పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రటించారు. మరోవైపు, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.