1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Kakinada : Son kills mother for not bringing cold water from fridge

అడగ్గానే ఫ్రిజ్‌లో నీళ్లు ఇవ్వలేదని అమ్మను చంపేశాడు...

deadbody
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఓ దారుణం జరిగింది. అడగ్గానే ఫ్రిజ్‌లో నీళ్లు ఇవ్వలేదన్న కోపంతో కన్నకొడుకు అమ్మను చంపేశాడు. ఫ్రిజ్‌లో నీళ్లు అడిగితే, త్వరగా తేలేదన్న ఆగ్రహంతో విచక్షణ మరిచిపోయి తల్లిపై కొడుకు పాశవికంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు... స్థానిక ఈబీసీ కాలనీకి చెందిన పెంటా నాగమణి (45) తన కుమారుడు రాజబాబుకు ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం భోజనం వడ్డించింది. భోజనం చేస్తూ ఫ్రిజ్‌లో ఉన్న నీళ్లు తేవాలని అమ్మను కోరాడు. అయితే, నీళ్లు తేవడంలో తల్లి జాప్యం చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజబాబు పెద్దగా అరుస్తూ ఫ్రిజ్ దగ్గరకు వేగంగా వెళుతూ గుమ్మాన్ని ఢీకొని గాయపడ్డాడు. 
 
దీంతో విచక్షణ కోల్పోయిన అతడు అదేసమయంలో నీళ్ళిచ్చిన తల్లి తలను పూజ గదిలోని చెక్క బల్లకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై, నేలపై పడిపోయింది. ఇంతలో ఇంటికొచ్చిన భర్త త్రిమూర్తులు, ఇరుగుపొరుగువారితో కలిసి భార్యను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన నాగమణి ఆదివారం ఉదయం కన్నుమూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భార్య అనారోగ్యాన్ని తట్టుకోలేక బిడ్డలకు విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఆపై తానుకూడా..