సంబంధిత వార్తలు
- Heavy Rain Likely Across AP: ఏపీలో ఒకవైపు వర్షాలు.. ఒకవైపు ఎండలు
- పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య .. ఎక్కడ?
- డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్
- పదేపదే లైంగిక వేధింపులు.. చెప్పుతో కొట్టిన మహిళ.. ఎక్కడ?
- ఉద్యోగం రాదన్న ఆవేదనతో అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్య
కర్నూలులో రెచ్చిపోయిన వైకాపా మూకలు - టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో విపక్ష వైకాపా మూకలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యర్త తైజుమ్ బాషాపై వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా రహితంగా దాడి చేశారు. కర్రలు, కత్తులు, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారు.
బాషా తన ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాటు వేసిన వైకాపా కార్యకర్తలు.. అతనిపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న బాషాను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడిలో వైకాపా కార్యర్తలు జలీలు, పైజల్, ఆరిఫ్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల సవరణ కార్యక్రమంలో వైకాపా తప్పులు కనిపెడుతున్నారని, టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నాడనే కారణంతో బాషాపై నిందితులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రెండు కోతుల పోట్లాడుకుంటే ఓ మహిళ ప్రాణం పోయింది...
రెండు కోతుల పోట్లాడుకుంటే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెండు కోతులు కోట్లాడుకోవడంతో ఓ సిమెంట్ ఇటుకను కిందపడేయటంతో అది మహిళ తలపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచింది. ఈ దారణం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీలో దంపతులైన కొనపర్తి సత్యనారాయణ, పద్మ(55) నివాసం ఉంటున్నారు. పద్మ బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు.
అదేసమయంలో ఆ ఇంటిపై కప్పిన రేకులపై చేరిన కోతులు తీవ్రంగా పొట్లాడుకోసాగాయి. ఈ క్రమంలో రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన ఓ సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మ తలపై పడడంతో బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
