బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:05 IST)

యువతిని గట్టిగా పట్టుకుని కళ్లలో యాసిడ్ పోశారు

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో దారుణం జరిగింది. యువతిని గట్టిగా పట్టుకుని ఆమె కళ్లలో యాసిడ్ పోశారు దుండగలు. తమకు పరిచయమైన ఓ యువతిని తమకు దక్కకుండా తప్పించిందనే అనుమానంతో సదరు యువతిని దుర్మార్గులు ఆమెను ఇంటి నుండి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె కళ్లలో యాసిడ్‌ పోసి రుద్దారు.
 
దీనితో బాధితురాలు అక్కడికక్కడే కుప్పకూలింది. నిందితులు ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. యువతిని సమీప ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుండి రేవా మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బాధితురాలు తన సోదరుడితో కలిసి ఆమె ఇంట్లో ఉంటోంది. పొరుగున నివశించే నిందితుడు సుమ్మి రాజా, గోల్డీ రాజా వచ్చి, తాము కొంత ప్రశ్నించాల్సి ఉందని చెప్పి వారిద్దరినీ బలవంతంగా తీసుకెళ్లారు. వారిద్దరనీ భౌతికంగా వేధించిన తర్వాత, వారిని దారుణంగా కొట్టారు. యువతి కళ్లలో యాసిడ్ పోశారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా వుంది.