1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Nagpur Conversion: IAF Personnel's Wife Alleges Rape, Forced Conversion

వైమానిక దళ అధికారి భార్యపై అత్యాచారానికి పాల్పడిన పాత స్నేహితులు... ఎక్కడ?

victim woman
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యంత హేయమైన, దారుణ ఘటన ఒకటి జరిగింది. వైమానిక దళ అధికారి భార్యపై పాత స్నేహితులు అత్యాచారానికి తెగబడ్డారు. శీతల పానీయంతో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలను వసూలు చేశారు. అంతేకాకుండా ఆమెతో బలవంతంగా మతమార్పిడి కూడా చేయించి, నిఖా చేయించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులపై పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
పోలీసులు కథనం ప్రకారం.. భూమి లావాదేవీల విషయమై ఫిబ్రవరి 2025లో తన పాత స్కూల్ పరిచయస్తుడు అయ్యాజ్ తాజ్ మదారేను 24 యేళ్ళ బాధితురాలైన వైమానికదళ సతీమణి కలిసింది. వీరిద్దరూ ఫిబ్రవరి 8న ఒక హోటల్ సమావేశమయ్యారు. ఆ సమయంలో అయ్యాజ్ ఆమెకు ఇచ్చిన పానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ గత కొన్ని నెలలుగా ఆమె నుంచి దాదాపు రూ.4 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా, చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చేస్తామంటూ పలుమార్లు బెదిరింపులకు గురిచేశారు.
 
మే 31వ తేదీన నిందితుడు అయ్యాజ్, అతడి అనుచరుడు అమీన్ షేక్ కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ హజ్రత్ మౌలానా అనే మత పెద్ద ఆమె చేత బలవంతంగా మతమార్పిడి ఆచారాలు చేయించి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అయ్యాజ్‌తో నిఖా జరిపించినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. నగరం వెలుపల విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త వైమానిక అధికారి ఈ ఘోరం గురించి తెలుసుకుని, జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగ్‌పూర్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మల్కాపురంలో నావికాదళ అధికారి భార్య ఆత్మహత్య