శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (11:43 IST)

ప్రియుడి చేతిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య... ఎక్కడ?

deadbody
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ కిరాతక ప్రియుడు తన ప్రియురాలిని చంపేశాడు. మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిషబ్ నిగమ్ - వందన అనే యువతీ యువకులు గత పదేళ్లుగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. అయితే, వందన పూణెలోని హింజావాడిలో టెక్కీగా పని చేస్తుంది. ఈ క్రమంలో వందన కొంతకాలంగా అతడికి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో రిషబ్ మనస్తాపానికి గురయ్యాడు. ఆమెపై అనుమానం పెంచుకుని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. 
 
ఈ క్రమంలో ప్రియురాలిని కలిసేందుకు పూణె వచ్చిన రిషబ్... ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడకు వందనను పిలిపించి తుపాకీతో కాల్చి చంపేసి.. అక్కడ నుంచి ముంబైకి పారిపోయాడు. దీనిపై హోటల్ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 
 
సహజీవనం చేస్తున్న వ్యక్తితో వచ్చే నెలలో వివాహం.. అంతలోనే యువతి ఆత్మహత్య!
 
హైదరాబాద్ నగరంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను సహజీవనం చేస్తున్న వ్యక్తితో వచ్చే నెల 12వ తేదీన వివాహం జరగాల్సివుంది. అంతలోనే ఆ యువతి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రానికి చెందిన అదితి భరద్వాజ్ (34) గత కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే ఆమె గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుని, విడాకులు తీసుకుంది. 
 
ఆ తర్వాత మణికొండలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తనతో కలిసి పని చేసే చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్ అలీతో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో అతడు అత్తాపూర్ ఠాణా పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో ఓ అపార్టు‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అందులో అదితిని ఉంచారు. వీరిద్దరూ వచ్చే నెల 12వ తేదీన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
అయితే, గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లిన అదితి గర్భందాల్చినట్టు వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆమె ఆదివారం తెల్లవారుజామున మహ్మద్ అలీకి ఫోన్ చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు చెప్పారు. దీంతో అతడు హుటాహుటిన ఫ్లాట్‌కు చేరుకునే సమయానికి ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై మహ్మద్ అలీ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అదితి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు.