నూజివీడులో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విషాద ఘటన జరిగింది. ఇక్కడ చేరిన మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి తన ఉండే హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా గుర్ల మండలం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. అలాగే, హాస్టల్ విద్యార్థుల వద్ద రాములు మానసికపరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.