మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (16:07 IST)

శిరీష్ హత్య కేసులో బావే కీలక సూత్రధారి!

murder
వికారాబాద్‌ జిల్లా కాళ్లాపూర్‌లో జరిగిన యువతి శిరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి బావతో పాటు మరికొంతమంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన శిరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు.  
 
మరోవైపు శిరీష మృతదేహానికి వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు, వైద్యులు.. అత్యాచారం జరిగిందా? లేదా? అనేదాన్ని పరీక్షల్లో నిర్ధారించనున్నారు. పరీక్షల కోసం పరిగి నుంచి డాక్టర్‌ వైష్ణవి వచ్చారు. 
 
నీటికుంటలో పడినపుడు శిరీష కళ్లకు రాళ్లు గుచ్చుకుని గాయాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆమెపై దాడి చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శిరీష పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది.