సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (16:04 IST)

కందుకూరులో దారుణం : మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారం

rape victim
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మూగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాధిత మహిళ గట్టిగా కేకలు వేస్తూ వారి నుంచి తప్పించుకొని పెట్రోల్‌ బంక్‌లోకి వెళ్లింది. బంక్‌లో పని చేస్తున్న సిబ్బంది మహిళను నిందితుల చెర నుంచి రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితుల్లో ఒకరు ఆటో డ్రైవర్‌ కాగా.. మరో ఇద్దరు కందుకూరు టౌన్‌లో గూర్ఖాలుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
బుధవారం మధ్యాహ్నం డీఎస్పీ రామచంద్ర, సీఐ వెంకటరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై అత్యచారయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.