1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 25 మే 2023 (11:59 IST)

మళ్లీ హీటెక్కిన సింహపురి పాలిటిక్స్... ఆనం వర్సెస్ నేదురుమల్లి

Anam ramnarayana reddy
సింహపురి పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. ఎన్నికలకు ముందే సింహపురిలో వాతావరణం హీటెక్కింది. ఈసారి రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్‌ నేదురుమల్లి కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా మౌనం వీడారు. 
 
గత మూడు నెలలుగా రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆనం ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గంలో సంచలన కామెంట్స్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనం… చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే, తానూ అక్కడి నుంచే బరిలో దిగుతానని కామెంట్‌ చేశారు. 
 
అంతేగాకుండా 60 శాతం ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని హాట్‌ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ వెంకటగిరి ఇంఛార్జ్‌గా ఉన్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఆనం కామెంట్స్‌పై కౌంటర్‌ ఇచ్చారు. 60 శాతం కాదు కదా, ఆరుగు కూడా  వైకాపాను వీడే ప్రసక్తే లేదన్నారు. 
 
ఆత్మకూరులో కాదు…ఆనంకు దమ్ముంటే వెంకటగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఈ సవాలుపై ఆనం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.