గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 25 మే 2023 (11:04 IST)

ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో భద్రత పెంపు... హరీశ్‌కుమార్‌ గుప్తా

ttdtemple
తిరుమల భద్రతను పెంచే దిశగా రంగం సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు అయ్యింది. తిరుమలలో తనిఖీలు సమర్థంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
 
తిరుమల భద్రతా కమిటీ ముఖ్య అధికారిగా నియమితులైన హరీశ్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం అమలవుతున్న భద్రతను పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించాలని ఏడు విభాగాల నిపుణుల కమిటీ సభ్యులను హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు.
 
ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో అవసరమైన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.