1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Brahmotsavam at TTD's New Delhi temple from May 4

ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో మే 3 నుంచి బ్రహ్మోత్సవాలు

venkateswara swamy
దేశ రాజధాని నగరంలో వెలసిన శ్రీవారి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మే 3 నుంచి 13 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 3న అంకురార్పణతో ప్రారంభమై, మే 13న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ ప్రకటించింది. 
 
మే 8న స్వామి వారి కళ్యాణంతో పాటు ఆర్జిత సేవ, గరుడవాహన సేవ జరుపుతామని.. బ్రహ్మోత్సవాల కోసం సకల ఏర్పాట్లు చేసినట్లు తితిదే వెల్లడించింది. 
 
బ్రహ్మోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో వాహనసేవ ఉంటుందని,  బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, భోజనం ఏర్పాటు చేశామని, ఆలయంలో లడ్డు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీడియాతో తెలిపారు. 
తర్వాతి కథనం
29-04-2023 తేదీ శనివారం దినఫలాలు - సత్యనారాయణస్వామిని పూజించిన...