గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:49 IST)

తిరుమల కపిలేశ్వర ఆలయంలో భద్ర పుష్పయాగం.. ఎప్పుడంటే?

Kapileshwara Swamy
Kapileshwara Swamy
తిరుమలపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వచ్చే నెల (మే) 5న భద్ర పుష్పయాగం, మే 4న అంకురార్పణం నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కపిలేశ్వరుడు, కామాక్షి దేవికి పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చెరుకు రసం, విభూతి, పసుపు, చందనంతో నవ కలశ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆపై వివిధ పుష్పాలు, పత్రాలలతో భద్ర పుష్ప యాగ మహోత్సవం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
 
ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన అర్చకులు, ఆలయ అధికారులు తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే పాపాలను పోగొట్టేందుకు భద్ర పుష్ప యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.