సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (11:44 IST)

ఉద్యోగికి రూ.1500 కోట్ల విలువైన భవంతిని బహుమతి.. ఎవరు?

mukesh ambani
దేశ పారిశ్రామిక దగ్గజం ముఖేష్ అంబానీ రూ.1500 విలువ చేసే భవంతిని తనకు కుడిభజంలా ఉండే ఉద్యోగికి బహుమతిగా ఇచ్చారు. ఆ ఉద్యోగి పేరు మనోజ్ మోజీ. అంబానీ సంస్థల్లో చాలా యేళ్ల నుంచి పని చేస్తూ ఇంత ఖరీదైన బహుమతిని అందున్నారు. వ్యాపార వర్గాల్లో అంబానీకి కుడి భుజంగా ఆయనకు మంచి పేరుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఈ నేపథ్యంలో మనోజ్ మోడీకి రూ.1500 కోట్ల విలువ చేసే భారీ భవంతిని బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలించారు. ఈ భారీ భవంతి పేరు బృందావన్. 22 అంతస్తులు కలిగిన ఈ భవంతిలో ఏకంగా ఏడు ఫ్లోర్లను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన నేపియన్ సీ రోడ్ మలబార్ హిల్‌కు ఆనుకునివుంది. చుట్టూ పచ్చని పరిసరాలు అత్యున్నత స్థాయి సౌకర్యాలు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం మూడు వైపులా సముద్రం ఉండటం మరో ప్రత్యేకత. 
 
ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణణంలో ఉంది. ఒక్కో అంతస్తు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఏడు అంతస్తులను పార్కింగ్‌కు కేటాయించారు. ఈ ప్రాంతంలోని ఫ్లాట్స్ చదరపు అడుగు విస్తీర్ణం ధర రూ.45 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఆ భవంతి ధర రూ.1500 కోట్లకుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, మనోజ్ మోడీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలే డైరెక్టరుగా పని చేస్తున్నారు.