గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (16:10 IST)

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC ) నేడే ప్రారంభం! (video)

Nita Mukesh Ambani
Nita Mukesh Ambani
హైదరాబాద్, 31 మార్చి 2023: భారతదేశ మొట్టమొదటి బహుళ కళల సాంస్కృతిక కేంద్రమైన... నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) మార్చి 31, 2023న ప్రారంభమవుతుంది. ఇందులో భారతీయ, ప్రపంచవ్యాప్త.. సంగీతం, రంగస్థలం, లలిత కళలు, చేతివృత్తుల కళాఖండాలను ప్రదర్శిస్తారు. భారతదేశ, ప్రపంచ సాంస్కృతిక, మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో ఇదో ముందడుకు అవుతుంది. 
 
ఈ లాంచ్ ప్రోగ్రామింగ్‌లో మూడు బ్లాక్‌బస్టర్ షోలతో పాటూ... స్వదేశ్ అనే ప్రత్యేకంగా నిర్వహించే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్‌పోజిషన్‌ ఉంటుంది. అలాగే 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' అనే సంగీత థియేట్రికల్‌తో పాటూ.. 'ఇండియా ఇన్ ఫ్యాషన్' అనే కాస్ట్యూమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్, 'సంగం/సంగమం' అనే విజువల్ ఆర్ట్ షో ఉంటుంది. వీటితోపాటు.. భారతదేశ సాంస్కృతిక ఆచారాలు, ప్రపంచంపై వాటి ప్రభావంపై ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంటుంది. 
 
ఈ సందర్భంగా శ్రీమతి నీతా అంబానీ మాట్లాడుతూ, "ఈ సాంస్కృతిక కేంద్రానికి జీవం పోయడం ఒక పవిత్ర యాత్ర. సినిమా, సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, జానపద కథలు, కళలు, సైన్స్, ఆధ్యాత్మికతలలో మన కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, జరుపుకోవడానికి మేము ఒక స్థలాన్ని సృష్టించడానికి ఆసక్తిగా ఉన్నాము. మేము భారతదేశ ఉత్తమమైన వాటిని ప్రపంచానికి ప్రదర్శించడానికీ, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని భారతదేశానికి పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నాము" అని తెలిపారు.
 
పిల్లలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఈ కేంద్రం లోకి ఉచిత అనుమతి ఉంది. పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోటీలు, ఆర్ట్స్ టీచర్లకు అవార్డులు, ఇన్-రెసిడెన్సీ గురు-శిష్య ప్రోగ్రామ్‌లతో సహా సమాజ పోషణ కార్యక్రమాలపై ఈ కేంద్రం బలంగా దృష్టి సారిస్తుంది. పెద్దలకు కళా అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించనుంది. 
 
'స్వదేశ్' అని పిలిచే క్రాఫ్ట్ ఎక్స్‌పోజిషన్ ద్వారా.. పైతానీ, బనారసి వంటి ఎనిమిది అద్భుతమైన క్రాఫ్ట్‌లు, భారతీయ ప్రాంతీయ కళారూపాలను ప్రదర్శిస్తుంది. వీటిని రిలయన్స్ ఫౌండేషన్ సంవత్సరాలుగా ప్రోత్సహిస్తోంది.
 
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ భారతదేశ గొప్ప సాంస్కృతిక చరిత్రను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ప్రేక్షకులు nmacc.com లేదా BookMyShowలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.