శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (15:57 IST)

వాహనదారులకు అలెర్ట్ : ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ బాదుడే బాదుడు..

toll plaza
వాహనదారులకు అలెర్ట్. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఇవి సామాన్య ప్రజలపై మరింత భారాన్ని మోపనున్నాయి. ఇప్పటికే దేశంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలతో ప్రజలు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇపుడు టోల్ టాక్స్ పెంపు భారం మోపనున్నారు. 
 
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా టోల్ చార్జీలు 5 నుంచి 10 శాతం మేరకు పెరగనున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు చుక్కలను తాకడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు టోల్ చార్జీల పెంచితే వారిపై మరింత ఆర్థిక భారం పడనుంది. మరోవైపు, జాతీయ రహదారుల రుసుములు నిబంధనలు 2008 చట్టం మేరకు ప్రతి యేడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో టోల్ చార్జీలు పెంచాల్సి వుంది. ఇదే విషయంపై టోల్ చార్జీలపై కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేస్తుంది. ఈ ప్రతిపాదనల మేరకు ఈ చార్జీలను తగ్గించడం లేదా పెంచడం వంటివి చేస్తుంది. 
 
ఇటీవల ఈ సమావేశం నిర్వహించగా ఇందులో టోల్ చార్జీలను పెంచేందుకు మొగ్గుచూపుతున్నారు. కార్లు, లైట్ వేట్ మోటార్ వాహనాలకు 5 శాతం, భారీ వాహనాలకు 10 శాతం చొప్పున టోల్ ఫీజు పెంచే అవకాశం ఉంది. అలాగే, టోల్ గేట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు నెలవారీ పాసులు జారీచేస్తారు. 
 
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పాస్‌ చార్జీలు సైతం పది శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ లిమిటెడ్ ట్రిప్పులతో నెలకి రూ.315 ధరతో నెల వారీ పాసులు ఇస్తున్నారు. ఇక పాస్ చార్జీలను సైతం పెంచే అవకాశం ఉందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అంటున్నారు.