శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వరుణ్

దేశంలో కొత్తగా 9,355 కరోనా కేసులు

ay12 virus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు గురువారం మళ్లీ పది వేలకు చేరుకున్నాయి. బుధవారం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 24 మరణాలు సంభవించగా, ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 57410 క్రియాశీలక కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
దేశంలో కరోనా వ్యాప్తిని సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.13 శాతమన్న కేంద్రం, కొవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని వెల్లడించింది. ఇక దేశంలో ఇప్పటివరకూ 22.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు.