గురువారం, 30 నవంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:46 IST)

రేపు జూలై నెల ఆర్జిత సేవ - శ్రీవాణి టిక్కెట్ల విడుదల

venkateswara swamy
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి జూలై నెల ఆర్జిత సేవా, శ్రీవాణి టిక్కెట్ల విడుదల చేయనుంది. ఇందులో తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ టిక్కెట్లను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. మంగళవారం స్వామివారిని 66,476 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చిందని తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో వారు సమర్పించిన కానుకల రూపంలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. అదేసమయంలో 25,338 మంది భక్తులు తలనీనాలు సమర్పించిన కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. 
 
ఇక తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా శ్రీవారి దర్శనం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో జూలై నెలలో సంబంధించిన ఆర్జిత సేవ, శ్రీవాణి టిక్కెట్లను తితిదే గురువారం విడుదల చేసింది.