ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (10:50 IST)

ఈ నెల 24న ఆన్‌లైన్‌లో.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు..

tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం మే, జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనుంది. రెండు నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌‌లో అందుబాటులో ఉంటాయని తితిదే తెలిపింది. 
 
అంతేకాదు మే, జూన్ నెలలకు సంబంధించిన వసతి గదులను కూడా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను కూడా ఈ నెల 24న ఉదయం పదిగంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 
 
దీంతో పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.