సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జనవరి 2025 (17:59 IST)

పొరుగింటి మగాడితో పడక సుఖానికి బానిసైన భార్య.. అడ్డొస్తున్న భర్తను చంపేసింది..

murder
పొరుగింటి మగాడితో అక్రమ పడక సుఖానికి ఓ వివాహిత బానిసైంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఆయన భార్యను మందలించాడు. అప్పటి నుంచి తన ప్రియుడుతో ఏకాంతంగా గడపడతం కష్టసాధ్యంగా మారింది. దీన్ని తట్టుకోలేని ఆ మహిళ.. తన ప్రియుడుతో కలిసి భార్యను చంపేసింది. ఈ దారుణం ఏపీలోని తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం గజసింగ రాజుపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గజసింగ రాజపురానికి చెందిన ఆంథోని (32)కి, చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఇరుగువాయికి చెందిన సుగంధితో 12 యేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పదేళ్ల లోపులగల ధనిత. దక్షిత అనే ఇద్దరు కుమార్తెలు, దేవిప్రసాద్ అనే అబ్బాయి ఉన్నారు. ఆంథోని తాగుడుకు బానిసై భార్యను వేధించసాగాడు. పైగా, భార్య కోరికలను తీర్చలేక పోయాడు. 
 
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అరుణ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే, ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. అంతే... తమ సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. 
 
శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో నిద్రిస్తున్న ఆంథోని మెడకు సుగంధి, అరుణ్‌లు తాడును బిగించి చంపేశారు. తర్వాత వారిద్దరూ గ్రామం విడిచి పారిపోయారు. దీంతో ఇటు తండ్రి భౌతికంగా దూరం కావడం, తల్లి పరాయి మగాడితో లేచిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు.