శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 27 మే 2017 (18:49 IST)

అమిత్ షా అవమానం... త్రివిక్రమ్‌ చిత్రంతో పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్? ఏం చేయబోతున్నారు?

2014 ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకుని మరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాజపా-తెదేపాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరూరా తిరిగి ఆ పార్టీలకు ఓట్లు వేయండి అంటూ కాంపైన్ చేశారు. కానీ మూడేళ్లు గడిచేసరికి సీన్ రివర్స్ అయినట్లు కనబడుతోంది. పవన్ కల్యాణ్‌ను

2014 ఎన్నికల సమయంలో కాలికి బలపం కట్టుకుని మరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాజపా-తెదేపాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరూరా తిరిగి ఆ పార్టీలకు ఓట్లు వేయండి అంటూ కాంపైన్ చేశారు. కానీ మూడేళ్లు గడిచేసరికి సీన్ రివర్స్ అయినట్లు కనబడుతోంది. పవన్ కల్యాణ్‌ను ఆ రెండు పార్టీలు కూరలో కరివేపాకులా తీసి అవతల పడేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తాజాగా భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా సైతం ఏపీ పర్యటన సమయంలో పవన్ కళ్యాణ్‌ను మాటవరసకైనా పిలువలేదు. కనీసం ఆయన గురించి చిన్న మాట కూడా చెప్పలేదు. దీనితో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. మా నాయకుడిని ఎన్నికల్లో ఉపయోగించుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 
 
మరి దీనివల్లనో దేనివల్లనో కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రం త్రివిక్రమ్‌తో ముగిశాక సినిమాలకు బ్రేక్ చెప్పాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని తన నిర్మాతలకు కూడా చెప్పినట్లు ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలకు కట్ కొట్టి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో మునిగిపోవాలని పవర్ స్టార్ అనకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు స్వస్తి చెపుతారా... లేదంటే ఎన్నికల తర్వాత మళ్లీ అన్నయ్యలా రంగేసుకుంటారా అనేది తేలాలంటే 2019 ఎన్నికల వరకూ చూడాల్సిందే మరి.