భూమా బతికి ఉంటే పల్లెకు 50-50 ఛాన్స్ ఉండేదయ... ఏంటది?
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తొలగించబడే మంత్రుల పేర్లలో రాష్ట్ర సమాచార, ఐటి శాఖ మంత్రి పేరు కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. కానీ గత 20 రోజులుగా పల్లె రఘునాథరెడ్డికి అన్నీ అనుకూలంగా మారాయి. రాయలసీమ నుంచి భూమా నాగిరెడ్డికి మంత్రి ప
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తొలగించబడే మంత్రుల పేర్లలో రాష్ట్ర సమాచార, ఐటి శాఖ మంత్రి పేరు కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. కానీ గత 20 రోజులుగా పల్లె రఘునాథరెడ్డికి అన్నీ అనుకూలంగా మారాయి. రాయలసీమ నుంచి భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే కచ్చితంగా ఒక రెడ్డిని తీయాల్సి వచ్చేది.... అప్పుడు బొజ్జలా? పల్లెనా? అంటే సీఎం ఎవరినో ఒకరిని తొలగించేవారు.. భూమా మరణంతో పాటు అనేక అంశాలు పల్లె రఘునాథరెడ్డికి కలిసొచ్చాయంటున్నారు.. రెడ్డి వర్గం నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న అమర్ నాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిల్లో వివాద రహితుడు, నిజాయితీపరుడు, పార్టీని గత 22 ఏళ్లుగా అట్టిపెట్టుకోవడమేనని అంటున్నారు..
ఎన్నికల్లో పార్టీ ఫండ్ తీసుకోకుండా సొంత డబ్బులతో గెలుస్తున్న చరిత్ర ఒక్క పల్లెకు మాత్రమే దక్కింది. పల్లె రఘునాథ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలోనే కాదు... వైఎస్ జగన్ 2009 ఎన్నికలకు ముందు కూడా పల్లెను పార్టీ మార్చడానికి చాలా రకాలుగా ప్రయత్నించినా... తెలుగుదేశం జెండానే తన అజెండాగా చెప్పిన కరుడుగట్టిన తెలుగుదేశంవాది పల్లె. జిల్లాలో కూడా అందరు ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ఓటేసేది కూడా పల్లెకే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడుసార్లు ఓడిపోయారు... అలాంటి వ్యక్తికి ఆనం బ్రదర్స్‌ను కాదని మరీ చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కాబట్టి సోమిరెడ్డికి మరో ప్రమోషన్ ఇవ్వడం కుదరదని బాబు తెగేసి చెప్పారట.
దీనికి తోడు సోమిరెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. కాకాని వర్సెస్ సోమిరెడ్డి వివాదాలు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక మాగుంట శ్రీనివాసులరెడ్డికి కూడా చంద్రబాబు వద్ద పెద్దగా మార్కులు లేవంటున్నారు. భూమా నాగిరెడ్డి, అమరనాథ రెడ్డిలు ఇద్దరి పేర్లను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి పరిశీలించారు.. భూమాకు ఆల్‌మోస్ట్ ఫిక్స్ చేసేశారట. కానీ అంతలోనే ఆయన గుండెపోటుతో చనిపోయారు. దీంతో పల్లెకు ఆ అడ్డంకి కూడా తప్పిపోయింది. భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చేంత అనుభవం లేదని, మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి ఆర్టీసీ చైర్మన్ లాంటి ఇంకేదైనా పదవి ఇస్తే బావుంటేదనేది చంద్రబాబు ఆలోచనగా వుందని చెబుతున్నారు.
అమరనాథ రెడ్డికి మాత్రం మంత్రి పదవి అవకాశం కల్పించడానికి అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే చిత్తూరు కోటాలో సీఎంతోపాటు బొజ్జల ఉన్నారు.. లోకేష్‌కు ఎలాగూ మంత్రి పదవి ఖాయం కాబట్టి ఆ జిల్లా నుంచి ముగ్గురు అవుతారు.. అప్పుడు అమరనాథరెడ్డికి ఇవ్వాలంటే బొజ్జల గోపాలరెడ్డిని తప్పించడం మినహా మరో అవకాశం లేదంటున్నారు. ఆ రకంగా కూడా పల్లెకు అవకాశాలు మెరుగుపడ్డాయంటున్నారు.
భూమా బతికి ఉంటే పల్లెకు 50-50 ఛాన్స్ ఉండేదని, ఇప్పుడు 100 పర్సెంట్ బెర్త్ ఖాయమంటున్నారు. రెడ్ల కోటాలో పల్లెను తప్పించి మరొకరికి ఇవ్వడానికి అర్హతలున్నా మొనగాడెవ్వరూ లేరన్నది జగమెరిగిన సత్యం. అందుకే సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరుగుతున్నా.... దాన్నీ కొన్ని పత్రికలు కాపీ పేస్ట్ చేస్తూ పదేపదే రాస్తున్నా పల్లె మాత్రం బిందాస్‌గా ఉన్నారట.