గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (16:31 IST)

తమిళనాడులో కమలహాసన్ వంతు... బిజెపితో దోస్తీ ఘురూ..?

ఇప్పటివరకు రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఉత్కంఠ కొనసాగగా ఇప్పుడు మరో విలక్షణ నటుడు కమలహాసన్ ఆ వైపే దారి మళ్ళాడు. తన అభిమానుల నుంచి వేరొకరి నుంచీ ఎలాంటి ఒత్తిడిలు కమలహాసన్‌కు లేవు.

ఇప్పటివరకు రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఉత్కంఠ కొనసాగగా ఇప్పుడు మరో విలక్షణ నటుడు కమలహాసన్ ఆ వైపే దారి మళ్ళాడు. తన అభిమానుల నుంచి వేరొకరి నుంచీ ఎలాంటి ఒత్తిడిలు కమలహాసన్‌కు లేవు. ఆయనే స్వయంగా ఒక నిర్ణయానికి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితులతో కమల్ చెప్పేశారు. చివరకు అలా అలా కమల్ రాజకీయ రంగప్రవేశం ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.
 
కమల హాసన్.. రజనీకాంత్. ఇద్దరికి ఒకే స్థాయిలో అభిమానులున్నారు. ఇద్దరూ టాప్ హీరోలే. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఇద్దరు హీరోలకు మంచి క్రేజ్ ఉంది. వారు తీసే సినిమాలంటే అభిమానులకు చాలా ఇష్టం. ఏ సినిమా అయినా ఖచ్చితంగా వందరోజులు ఆడాల్సిందే. అలాంటి హీరోలు కాస్త ప్రస్తుతం రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. రజినీకాంత్ విషయం ఇప్పట్లో ఆలస్యమవుతుండగా కమల్ మాత్రం ఒక్కసారిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆలస్యం.. అమృతం... విషం అన్న సామెతను సరిగ్గా ఒంట పట్టించుకున్న కమల్ ఈ సమయంలో రాజకీయాల్లోకి రావడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారట.
 
రజినీకాంత్ మొదటగా రాజకీయాల్లోకి వస్తారను అనుకున్న కమల్.. ఆ తర్వాత రజినీ రాకపోవడంతో తానే రావాలన్న నిర్ణయానికి వచ్చారట. కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడంతో ఇక బిజెపి నేరుగా రంగంలోకి దిగింది. ఇప్పటికే తమిళనాడులోని కొంతమంది బిజెపి నేతలు కమల్‌ను కలిసి బిజెపితో జతకట్టాలని కోరారట. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కలిస్తేనే మంచిదన్న ఆలోచనలో కమల్ ఉన్నారట. ఏ విషయాన్ని త్వరలోనే చెబుతానని బిజెపి నాయకులకు చెప్పి పంపించేశారట. కమల్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైనా సొంత పార్టీ పెడుతారా లేక బిజెపితో కలుస్తారా అన్నది వేచి చూడాల్సిందే.