శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (11:55 IST)

మనస్సు మార్చుకున్న రజినీ... ఏం చేయబోతున్నాడో తెలుసా..?

సూపర్‌స్టార్ రజినీకాంత్ అప్పుడప్పుడు తన మనస్సు మార్చుకుంటూనే ఉంటారు. ఎప్పుడు స్థిమితంగా ఉండే రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు సమస్యలు వచ్చిపడుతోంది. ప్రతి దానికి ప్రస్తుతం రజినీ

సూపర్‌స్టార్ రజినీకాంత్ అప్పుడప్పుడు తన మనస్సు మార్చుకుంటూనే ఉంటారు. ఎప్పుడు స్థిమితంగా ఉండే రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు సమస్యలు వచ్చిపడుతోంది. ప్రతి దానికి ప్రస్తుతం రజినీ టెన్షన్ పడుతున్నట్లు కుటుంబ సభ్యులే చెబుతున్నారు. కారణం అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి.. ఇలా ఒక్కటి కాదు రజినీకి సమస్యలు. అయితే రజినీ మాత్రం ఒక్కోసారి ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే జూలై నెల 3వ తేదీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న రజినీ మళ్ళీ మనస్సు మార్చుకున్నారు. కారణం అప్పటివరకు రాజకీయాలు ఏ విధంగా మారుతాయో.. ప్రభుత్వం ఉంటుందో.. పడిపోతుందా అని వేచి చూసే దోరణిని అవలంబిచాలన్నదే రజినీ ఆలోచన. అందుకే ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారట. అయితే పక్కాగా ఈసారి అనుకున్న సమయానికే రాజకీయాల్లోకి రానున్నారట రజినీ.
 
డిసెంబర్ 12. రజినీ పుట్టినరోజు. ఆ రోజు ఎట్టిపరిస్థితిలో రాజకీయ అరంగేట్రం చేయాలన్నదే రజినీ ఆలోచన. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక పక్కా నిర్ణయానికి వచ్చేశారట. అందుకే రజినీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ ఈ విషయాన్ని మీడియాకు స్వయంగా తెలిపారు. రజినీ డిసెంబర్ 12న రాజకీయ ప్రకటన చేస్తారని, అయితే పార్టీ పెడతారా లేక ఉన్న పార్టీలో చేరతారా అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు సత్యనారాయణ గైక్వాడ్. కానీ రజినీ ఎట్టి పరిస్థితుల్లోను డిసెంబర్ 12న రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయమని తేలిపోయింది. 
 
భారీ అభిమానులు, తమిళనాడు ప్రజల మధ్య పుట్టినరోజు జరుపుకుంటే రాజకీయ అరంగేట్రంపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా తమిళనాడు మున్నేట్రపడై, నామ్ తమిళర్ పార్టీలు రజినీ రాజకీయాల్లోకి రాకూడదని రాద్దాంతం చేయడం, రజినీ లోకల్ కాదని, నాన్ లోకలంటూ ఆయన్ను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. అందుకే ఆచితూచి మెల్లగా రజినీ అడుగులు వేసుకుంటున్నారట. ఇంకా 6 నెలల గడువు ఉంది కాబట్టి మెల్లగానే ఈ సమస్యలన్నీ సద్దుమణిగి ప్రశాంత వాతావరణంలో రాజకీయ ప్రకటన చేయాలన్నది రజినీ ఆలోచన.