బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (14:30 IST)

జయలలిత మేనల్లుడు దీపక్ కొత్త నాటకం... ఏంటది..?

తమిళనాడులో జరుగుతున్న ట్విస్ట్‌లు ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయాల్లో బంధుత్వం అనేది ఉండదని చెబుతుంటారు. అది నిజమే అనిపిస్తుంది. తమిళరాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.

తమిళనాడులో జరుగుతున్న ట్విస్ట్‌లు ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయాల్లో బంధుత్వం అనేది ఉండదని చెబుతుంటారు. అది నిజమే అనిపిస్తుంది. తమిళరాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. జయలలిత మరణించిక ముందు వరకు అన్నాచెల్లెల అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన జయలలిత అన్న దీపా జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్‌లు ఆమె మరణం తరువాత పూర్తిగా మారిపోయారు. కేవలం ఆస్తి కోసమే వీరు ఇదంతా చేస్తున్నారని స్వయంగా రాజకీయ విశ్లేషకులే చెప్పుకుంటున్నారు. అసలు రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ ఇక్కడ అంత అవసరం ఉండదనుకోండి.. కారణం చాలా స్పష్టంగా ప్రతి విషయం అర్థమవుతుంది తమిళ రాజకీయాల గురించి. 
 
కోట్ల రూపాయల ఆస్తులు. అసలు ఎన్ని కోట్లు జయలలితకు ఆస్తులు ఉన్నాయో ఇప్పటికీ తెలియదు. అలాంటి ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నం తమిళనాడులో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. జయలలిత అంత్యక్రియల తరువాత సైలెంట్‌గా ఉన్న దీపక్ ఆ తర్వాత ఒక్కసారిగా ఆస్తి కోసం శశికళ, దినకరన్‌లతో చేతులు కలిపాడన్న ఆరోపణలు లేకపోలేదు. అది కరెక్టని నిరూపిస్తూ ఆదివారం అక్క దీపపైనే దాడి చేయించే ప్రయత్నం చేశాడు దీపక్. ఆస్తి గురించి మాట్లాడదామని దీపక్ పిలిస్తే తన మద్దతు దారులతో కలిసి పోయెస్ గార్డెన్‌కు వెళ్ళిన దీపకు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. శశికళ వర్గీయులు ఒక్కసారిగా దీప మద్దతుదారులపై దాడికి యత్నించారు. హఠాత్పరిణామంతో దీప నివ్వెరపోయింది. తేరుకునే లోపే పోలీసులు రావడం హైడ్రామా నడవడం అన్నీ జరిగిపోయాయి.
 
ఇక దీప చేసేది లేక జయలలితను చంపింది దీపక్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. శశికళతో కలిసి దీపక్ జయను చంపేశారంది. దీప మాటలపై దీపక్ మరో రకంగా స్పందించాడు. అటు శశికళ మేనల్లుడు దినకరన్, మరోవైపు దీప వల్ల తనకు ప్రాణాపాయం ఉందని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే హైడ్రామా మొత్తం దీపక్, దినకరన్‌లే ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్తిలో దీపకు వాటా లేకుండా మొత్తం నొక్కేద్దామన్నదే వీరి ఆలోచనంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ పెద్ద ట్విస్టేమిటంటే శశికళ, దినకరన్‌లతో చేతులు కలిపిన దీపక్ చివరకు వారే తనను చంపేయడానికి యత్నిస్తున్నారని చెప్పడం. మొత్తం మీద అన్నాచెల్లెల్ల వ్యవహారం ఏ స్థాయికి వెళ్ళి ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.