తెలుగుదేశంలోకి చిరంజీవి... డిసెంబర్ 5న పార్టీ తీర్థం...?
మెగాస్టార్ చిరంజీవి తెలుగుదేశంపార్టీ చేరికకు వేగంగా పావులు కదులుతున్నాయి. ఏకంగా నారా లోకేష్ రంగంలోకి దిగి చిరును తెదేపాలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం. సీఎం చంద్రబ
మెగాస్టార్ చిరంజీవి తెలుగుదేశంపార్టీ చేరికకు వేగంగా పావులు కదులుతున్నాయి. ఏకంగా నారా లోకేష్ రంగంలోకి దిగి చిరును తెదేపాలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే లోకేష్ చిరుతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభ్య సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చిరంజీవి తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్న విషయాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అదేసమయంలో డిసెంబర్ 5వ తేదీన చిరు పార్టీలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.
చిరంజీవి. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. సినీరంగంలో అగ్రహీరోగా వెలిగిన చిరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జీరో అయ్యారని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే పార్టీని నడిపి కాంగ్రెస్‌లోకి కలిపేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి అయినా సరే కొన్ని రోజులు మాత్రమే ఉండగలిగారు. కానీ రాజ్యసభ మాత్రం ఐదేళ్లు. కాంగ్రెస్ అధికారం కోల్పోయినా సరే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా చిరంజీవి ఉన్నారు.
గత కొన్నినెలలుగా తన 150వ సినిమాపైనే ఎక్కువ దృష్టి పెడుతూ వస్తున్నారు చిరంజీవి. ఈ గ్యాప్‌లోనే రాజకీయాల గురించి కూడా చిరంజీవి ఆలోచిస్తూ వచ్చారు. కానీ ఇంతలో నారా లోకేష్ నేరుగా చిరంజీవిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం, చిరు అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయట. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉంటానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చిరునే స్వయంగా నారా లోకేష్‌కు చెప్పారట. డిసెంబర్ 5వ తేదీన మంచి ముహూర్తం ఉందని ఆ రోజు విజయవాడకు వచ్చి అమరావతిలో తెదేపా తీర్థం పుచ్చుకుంటానని చిరంజీవి లోకేష్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.