ఎపి మంత్రులకు బాబును చూస్తే భయం... రంగంలోకి నారా లోకేష్ బ్రిగేడ్...
ఏపీ మంత్రులకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఎవరీ పదవి ఊడుతుందో తెలియక మంత్రులు చంద్రబాబు సన్నిహితుల దగ్గరకి క్యూ కడుతున్నారట. ముఖ్యమంత్రి నిజంగానే విస్తరణ ఉంటుందని చెప్పారా? లేక కొందరి మంత్రులను వార్నింగ్ ఇచ్చేందుకు ఈ సిగ్నల్స్ పంపారా
ఏపీ మంత్రులకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఎవరీ పదవి ఊడుతుందో తెలియక మంత్రులు చంద్రబాబు సన్నిహితుల దగ్గరకి క్యూ కడుతున్నారట. ముఖ్యమంత్రి నిజంగానే విస్తరణ ఉంటుందని చెప్పారా? లేక కొందరి మంత్రులను వార్నింగ్ ఇచ్చేందుకు ఈ సిగ్నల్స్ పంపారా అని వారు మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు సేఫ్? ఎవరి పదవులు ఊడుతాయి అనే యాంగిల్‌లో విశ్లేషణలు మొదలయ్యాయి. ఎవరీ పనిమీద చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు దగ్గర ఏఏ నివేదికలు చేరాయి అనే విషయాలపై మంత్రులు ఆరా తీస్తున్నారు.
అయితే రాజకీయవర్గాల సమాచారం ప్రకారం అరడజనుకు పైగానే మంత్రులకు చంద్రబాబు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పనితీరు మార్చుకోని మంత్రులను ఆయన సాగనంపుతారు. అందుకే కులాల ఈక్వేషన్‌లో చంద్రబాబు కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది సస్పెన్స్‌గా మారింది. పనితీరు పరంగా, సామాజిక లెక్కల ప్రకారం దేవినేని ఉమా, యనమల, పరిటాల సునీత మాత్రం సేఫ్ అని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి మంత్రి పీతలను తప్పిస్తారనే టాక్ విన్పిస్తోంది. అవినీతి ఆరోపణలు రావడం, శాఖపై పట్టు లేకపోవడంతో ఆమెను తీసే అవకాశాలు ఎక్కువ.
ఇటు తూర్పుగోదావరి జిల్లాలో యనమల, చినరాజప్ప ఉన్నారు. చినరాజప్పను పక్కనపెట్టేసి యాక్టివ్‌గా ఉండే కాపు నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. గుంటూరులో రావెలకు గుడ్‌బై చెప్పొచ్చని ప్రచారం నడుస్తోంది. విశాఖ అయ్యన్నపాత్రుడికి ఢోకా లేదు. అయితే గంటా శ్రీనివాసరావు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనను అప్రాధాన్యశాఖకు పంపే అవకాశాలు ఎక్కువ.
మరోవైపు కేఈ కృష్ణమూర్తి శాఖ కూడా మారే అవకాశం ఉంది, రాయలసీమ నుంచి ఈసారి కొందరికి మంత్రులుగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక కొల్లు రవీంద్ర, మృణాళిని, పల్లె రఘునాథ రెడ్డి, శిద్దా రాఘవరావు, బొజ్జల, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, నారాయణ , పనితీరుపై బాబు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వీరిని పక్కనపెట్టి లోకేష్ బ్రిగేడ్‌కు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.