శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : మంగళవారం, 16 మే 2017 (15:28 IST)

శ్రీవారి రూ.వెయ్యి కోట్ల ఆస్తి టాటా కంపెనీకి.. ఎందుకు..?

వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా సరిపోతుందన్న సామెత ఒకటుంది. తిరుమల శ్రీవారి ఆస్తులే కదా ఇచ్చేస్తే పోలే అన్న విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా వ

వడ్డించే వాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా సరిపోతుందన్న సామెత ఒకటుంది. తిరుమల శ్రీవారి ఆస్తులే కదా ఇచ్చేస్తే పోలే అన్న విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల తిరుమల శ్రీవారి ఆస్తిని అప్పనంగా టాటా కంపెనీ చేతిలో పెట్టారు. దీనికొక పేరు కూడా పెట్టారు. కేన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసమని. అయితే ఈ మొత్తంలో టాటా కంపెనీ ఎంత ఖర్చు చేస్తుందో... ఎంత స్వాహా చేస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. దీనిపై ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు.
 
సొమ్ము ఒకటిది.. సోకొకడిది అన్న చందంగా తయారైంది తితిదే ఉన్నతాధికారుల తీరు. భక్తులు ఎంతో భక్తిభావంతో స్వామివారికి సమర్పించే డబ్బును ఇష్టానుసారం ప్రైవేటు కంపెనీలకు దానం చేస్తున్నారు. కోల్‌కత్తాలో టాటా కంపెనీ కేన్సర్ ఆసుపత్రిని నడుపుతోంది. ఈ కేన్సర్ ఆసుపత్రికి అంతో ఇంతో పేరుంది. దీన్ని దృష్టిలో  పెట్టుకున్న తితిదే ఒక కేన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టాటా కంపెనీకి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీని విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుంది. 
 
టాటా కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కూడా చేసేసుకున్నారు తితిదే ఉన్నతాధికారులు. తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ప్రైవేటు కంపెనీ చేతుల్లో విలువైన ఆస్తిని పెట్టడంపై ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.