Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమపిండితో ఎగ్ స్టఫ్డ్ పరోటా ఎలా చేయాలో చూద్దాం..

ముందుగా ఓ గిన్నెలో ఉడికించిన కోడిగుడ్లను సన్నగా తురుముకోవాలి. అందులో మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. మరో పాత్రలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి స

Written By Selvi
Updated: బుధవారం, 26 ఏప్రియల్ 2017 (13:15 IST)
గోధుమలు, కోడిగుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు. రోజూ అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకోవడంతో పాటు.. గోధుమ రొట్టెలను మితంగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబోలో వీట్ ఎగ్ స్టఫ్డ్ పరోటా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
ఉడికించిన కోడిగుడ్లు : ఆరు,
గోధుమపిండి: పావుకిలో,
మిరియాలపొడి: టీస్పూను, 
కొత్తిమీర తురుము: అరకప్పు
నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా
ఉప్పు : తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా ఓ గిన్నెలో ఉడికించిన కోడిగుడ్లను సన్నగా తురుముకోవాలి. అందులో మిరియాలపొడి, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. మరో పాత్రలో గోధుమపిండి, ఉప్పు, టేబుల్‌స్పూను నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి సుమారు పావుగంటసేపు నాననివ్వాలి. ఇప్పుడు పిండి ముద్దను చపాతీల్లా వత్తుకోవాలి. తరవాత అందులో గుడ్డుమిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి మళ్లీ చపాతీలా వత్తి పెనంమీద నెయ్యి లేదా వెన్న వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. అంతే వీట్ ఎగ్ స్టఫ్డ్ పరోటా రెడీ అయినట్లే. ఈ ఎగ్ పరోటాలను గ్రీన్ చట్నీ లేదా చికెన్ కుర్మాతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 

అన్నీ చూడండి

ప్రియుడితో వీడియో వైరల్..యువతిని మట్టుబెట్టిన తండ్రి, సోదరుడు... ఎక్కడ?

డీఎస్సీపై వైకాపా చీఫ్ జగన్ ప్రశ్నల వర్షం... కుమారుడిని కాపాడుతున్న సీఎం బాబు

1980స్ రెట్రో ఏఐ ఫోటో ట్రెండ్‌‌లో భాగమైన రేవంత్ రెడ్డి.. రెట్రో లుక్ అదుర్స్.. పాతతరం హీరోలా?

మేకల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

ఆ రోజు వైసిపి ప్రభుత్వం ఆ పని చేయకుంటే...? Xలో ట్రెండ్

అన్నీ చూడండి

Ibomma: ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఐ బొమ్మ\ షూటింగ్ కంప్లీట్ చేశాం : డైరెక్టర్ విజయ్

జి.వి.ప్రకాష్ కుమార్ ఆవిష్కరించిన చకోర లోని ధమ్ ధమ్ సాంగ్

Ayush Tejas: శరత్ బాబు వారసుడు ఆయుష్ తేజస్ టాలీవుడ్ ఎంట్రీ

Sardar 2 Review: సర్దార్ 2 చిత్రం కార్తీ కి కలిసి రాలేదా? సర్దార్ 2 రివ్యూ

Udayabhanu: పంచనామాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా : ఉదయభాను ఎమోషనల్

తర్వాతి కథనం
Show comments