పవర్‌ఫుల్ ఫెంగ్‌షుయ్ టిప్స్ : మీ పడక గది ఎలా వుండాలంటే?
మీ పడక గది ఫెంగ్‌షుయ్‌కి అనుకూలంగా లేకపోతే.. భాగస్వాముల మధ్య ప్రేమ సన్నగిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ పార్ట్‌నర్ మీపై జీవితాంతం ప్రేమగా ఉండాలంటే మీ బెడ్ రూమ్‌ను పాజిటివ్ ఎనర్జీలకు సానుకూలంగా ఏర్పాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అవేంటంటే..
మీ పడకగది ద్వారానికి ఎదురుగా అద్దాలు ఉంచకండి. బెడ్‌కు ఎదురుగా మిర్రర్ ఉన్నా, గది తలుపులకు ఎదురుగా అద్దాలున్నా భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. అదే చిన్న చిన్న సిల్వర్ క్రిస్టల్స్‌ను మీ పడకగదిలో ఉంచుకున్నట్లైతే జీవిత భాగస్వాముల మధ్య అనుబంధం పెంపొందుతుంది.
బెడ్ షీట్లను అప్పుడప్పుడు మారుస్తుండండి. బెడ్ రూమ్‌కు ఎర్రటి బెడ్ షీట్లను వాడండి. తెలుపు, బ్రైట్ రెడ్ లేదా బ్రైట్ గ్రీన్ వంటి రంగులను బెడ్ షీట్లుగా ఎంచుకోవడం ద్వారా పాజిటివ్ శక్తుల ప్రభావంతో దంపతులు అన్యోన్యంగా ఉంటారు.
అలాగే మీ పడకగదిలో ఒక జత పింక్ క్యాండిల్స్ ఉపయోగించండి. గదికి కుడివైపున ఈ క్యాండిల్స్ ఉంచితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవని ఫెంగ్ షుయ్ నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడూ గదిని శుభ్రంగా ఉంచుకోండి. అటాచ్డ్ బాత్‌రూమ్ మరీ నీట్‌గా ఉండాలి. వాటిని మూతపెట్టి వుంచడం మంచిది. మీ బెడ్‌కి ఇరు వైపులా రెండు ల్యాంప్‌లు ఏర్పాటు చేసుకోండి. ఖాళీగా డ్రాలను మూసివుంచండి.
పడకగదిలో ప్రేమను వ్యక్తపరిచే విధమైన ఫోటోలు ఉంచండి. ఇంకా ఎంట్రెన్స్‌లో అదిరిపోయే ప్రేమ పక్షుల ఫోటోలు ఉంచండి. బెడ్ రూమ్‌లో ఆఫీసు సంగతులను మాట్లాడకండి. మీ జీవితం గురించి కెరీర్ గురించి మాట్లాడటం మంచిది.
అలాగే మీ పడకగదిలో ల్యాంప్స్ తేలికపాటి వెలుతురును వెదజల్లేలా ఏర్పాటు చేసుకోండి. ఇంకా మైల్డ్ మ్యూజిక్ వుండేలా చూసుకోండి. చిన్న చిన్న ల్యాంప్‌లు ఎప్పుడూ వెలుగుతుండేలా చూసుకోండి.