Pujita Ponnada: ఈశ్వర్ రాచి రాజు హీరోగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో చిత్రం ప్రారంభం
Ishwar Rachi Raju, Likhitha, Pujita Ponnada, Sindhu Kasaram
ఈ రోజు పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా ఉండి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు - ఈశ్వర్ రాచి రాజు, నందు, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య, తదితరులు
