1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. 'Aakashamlo Oka Tara' Movie Review: An Inspiring Film

Aakashamlo Oka Tara Review: స్పూర్తి కలిగించేదిగా ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ

Dulquer Salmaan, Saathvika Veeravalli
Dulquer Salmaan, Saathvika Veeravalli
దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆకాశంలో ఒక తార. సాత్విక వీరవల్లి కథానాయిక. శ్రుతి హాసన్, రుహాని శర్మ, మురళీ శర్మ, నాజర్ తదితరులు నటించారు.
నిర్మాణం : గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మాతలు. నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలయింది. ఈ సందర్భంగా నవంబర్ 19 రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. మరి సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
మారుమూల గ్రామంలో పదోతరగతి చదివే కల్పన (సాత్విక వీరవల్లి)కు అంతరిక్షంలో చందమామ దగ్గరకు వెళ్ళాలని దానిని ఏరోనాటిక్ అంటారని (వ్యోమగామి) నాజర్ అనే మోటివేటివ్ వ్యక్తివల్ల తెలుస్తుంది. అయితే 10వ తరగతి చదవడమే దండుగ పెండ్లి చేసి పంపించేయాలనేది ఆమె తండ్రి మనస్తత్వం. మొత్తానికి చివరి పరీక్ష రాసే రోజే పెండ్లి చూపులు ఏర్పాటుచేసి పెండ్లి చేసేస్తాడు. 
 
ఇక పెండ్లి చేసుకున్న క్రిష్ణ తన సోదరిని పెండ్లి చూపులకు పంపడంతో కట్నం 4లక్షలతో పెండ్లికి ఒప్పందం చేసుకుంటుంది. ఊరిలో క్రిష్ణ మెకానిక్, డ్రైవర్ కూడా. శోభనం రోజే చిన్నపిల్లలా వున్న కల్పన చూసి ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని ఆమెను ఎలాగైనా అంతరిక్షంలో వెళ్ళేందుకు హయ్యర్ స్టడీస్ చదివేందుకు క్రిషి చేస్తాడు. అలా డబ్బు సంపాదనకోసం గుజరాత్ వెళ్ళి అక్కడ డ్రైవర్ గా చేరతాడు. ఈలోగా కల్పన చదువులో దూసుకుపోతూ స్పేస్ సెంటర్ లో జాబ్ సంపాదిస్తుంది. అక్కడ టీమ్ లో చేరి బెలూన్ ద్వారా కొంత దూరం రాకెట్ ను వెళ్ళేందుకు తన ఐడియా తో ఆకాశంలో పంపే ఏర్పాటు చేస్తుంది. కానీ మధ్యలో అది పేలిపోతుంది. ఆ తర్వాత ఏమయింది? శ్రుతిహాసన్ పాత్ర ఏమిటి? తన భార్యను వ్యోమగామి గా చూడాలనుకున్న క్రిష్ణ మధ్యలో ఎందుకు వద్దన్నాడు? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
ఈ చిత్ర కథ ఆద్యంతం ఎక్కడా నెగెటివ్ పాత్రలు, ప్రమాదాలు జరిగే సంఘటనలు కానీ వుండవు. అంతా పాజిటివ్ గానే సాగుతుంది. ఒక్క కల్పన తండ్రి పాత్ర తప్ప. ఇలా సాధారణ మహిళ వ్యోమగామి గా ఎలా సక్సెస్ అయింది అనేది కథ. గతంలో మహిళా సాధికారిక కథలు పలు మార్గాలలో వచ్చాయి. ఆమధ్య కొత్తమంది యువత రాకెట్ ను తయారుచేసి స్పాన్సర్లతో సక్సెస్ అయిన సంఘటన అందరికీ తెలిసిందే. అందుకు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. అది కూడా మ ధ్యలో పేలిపోయింది కూడా. 
 
సరిగ్గా ఈ అంశంతో గతంలో కల్పన చావ్లా వ్యోమగామి గా వెళ్ళడం, ఆమె చనిపోవడం వంటివి జరిగాయి. వీటిని స్పూర్తిగా తీసుకుని సినిమా తీసినట్లుగా తెలుస్తోంది. మహిళా సాధికారికత పేరుతో తీసిన ఈ సినిమా యూత్ ను ఇన్స్పిరేషన్ గా వుంది. ఇప్పటి జనరేషన్ తాము జీవితంలో ఏమి కావాలనుకుంటున్నామో? అనేది తెలుసుకుని అందుకు అడ్డంకులున్నా వాటిని అధికగమించేందుకు కష్టాలు పడి సక్సెస్ సాధించడమే జీవితానికి పరమార్థం అనే సందేశాన్ని దర్శకుడు పవన్ సాధినేని చెప్పాడు.
 
గతంలో సూర్య నటించిన ఆకాశవీధుల్లో సినిమా వచ్చింది. అందులో సామాన్యుడి కూడా విమానంలో ప్రయాణించే విధంగా తయారు చేయడం. అలాగే సముద్రఖని నటించిన విమానం సినిమా వచ్చింది. అందులో తన కొడుకు కోరికను ఏవిధంగా చేయగలిగాడు అనేది చూపించాడు. అలాంటి కోవలేనిదే ఈ సినిమా.
 
దర్శకుడు ప్రతి విషయాన్ని పరిశీలించి, ఎమోషన్స్ బాగా పండించేలా చేయగలిగాడు. అందుకు మిగిలిన పాత్రలన్నీ తోడయ్యాయి. అమాయకత్వం, కష్టపడే తత్త్వం, భార్య కోరికను నెరవేర్చే భర్తగా దుల్కన్ సల్మాన్ నటించాడు. పల్లెటూరి అమ్మాయి గా సాత్విక వీరవల్లి పాత్రను పండించింది. ఇక శ్రుతిహాసన్ పాత్ర కూడా జీవితంలో రాకెట్ తయారుచేయాలనే ఎయిమ్ తో వుంటుంది. గుజరాత్ లో దుల్కన్ కు సహకరించేు పాత్రలో రుహానీ శర్మ నటించింది. 
 
కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని మాత్రమే కాకుండా, ఒకరి జీవిత లక్ష్యాన్ని మరొకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో చూపించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ చిత్రానికి లభించిన UA13+ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లు నిండిన ప్రేక్షకులు చిత్రాన్ని చూడవచ్చు. 13 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మార్గదర్శకత్వం అవసరమని  సూచిస్తుంది. దీంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగ కథగా చిత్రంగా నిలిచింది.
 
లోగడ ఎన్.టి.ఆర్. సినిమాలో క్రిషి వుంటే మనుషులు రుషులవుతారు.. అనే పాట వుంది. అలాంటి స్పూర్తిని కలిగించే సినిమా ఆకాశంలో ఓ తార. ఇలాంటి సినిమాలు ఇప్పటి యువతకు చాలా అవసరం. పెద్దలు పిల్లల ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకుని మెలగాలని ఈ చిత్రం సూచిస్తుంది.
రేటింగ్ :3/5
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
స్టేజిపై హీరోయిన్‌కు ముద్దు పెడతానంటూ దగ్గరకు లాక్కున్న హీరో, అంత బలుపా అంటూ ట్రోల్స్