సంబంధిత వార్తలు
- Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు
- రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం
- పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. త్వరలోనే వాట్సాప్ సేవలు
- NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది
- Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?
పొరపాటున కూడా నా కలలోకి రావొద్దంటున్న 'డ్రాగన్'
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'డ్రాగన్'. ఈ చిత్రం నుంచి తొలి అప్‌డేట్‌గా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు అంటూ ఓ సరికొత్త రికార్డును తనపేరుపై లిఖించుకున్నాడు. నాలుగు నిమిషాల నిడివికలిగిన ఈ గ్లింప్స్.... విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇపుడు సరికొత్త రికార్డు దిశగా పయనిస్తోంది.
గత 24 గంటల్లో 'డ్రాగన్' గ్లింప్స్ 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నట్లు టీమ్ తెలిపింది. ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమా గ్లింప్స్‌నకు ఇన్ని వ్యూస్ రాలేదని వెల్లడించింది. ఇది ఆల్‌టైం రికార్డు అంటూ పోస్టర్ విడుదల చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రావడం ఖాయమంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో ఎన్టీఆర్ 'డ్రాగన్'గా రక్తపాతం సృష్టించే శక్తిమంతమైన పాత్రలో కనిపించారు. విజువల్స్ ప్రత్యేకమైన కథా ప్రపంచాన్ని ఆవిష్కరించాయి. 'కె.జి.ఎఫ్' చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్ 'సలార్' తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
