సంబంధిత వార్తలు
- స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల
- న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్
- Jennifer Lopez: అలవాట్లు, వ్యాయామంతో అందాన్ని కాపాడుకోవచ్చంటున్న జిమ్ మిర్రర్ సెల్ఫీలతో జెన్నిఫర్ లోపెజ్
- పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ చిత్రానికి కాసుల వర్షం, వారంలోనే రూ. 2 వేల కోట్లు
- అమెరికా వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఒకప్పటి హాలీవుడ్ స్టార్, ఏమైంది?
Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్
Spider-Man: Brand New Day
కొత్త పోస్టర్‌లో టామ్ హోలాండ్ పోషిస్తున్న పీటర్ పార్కర్ తన హూడీ కింద స్పైడర్-మ్యాన్ సూట్‌ను దాచుకుని కనిపిస్తున్నాడు. “ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా… అతడు తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు” అనే భావాన్ని ఈ పోస్టర్ బలంగా ప్రతిబింబిస్తోంది. తన నగరాన్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్న స్పైడర్-మ్యాన్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడని ఈ పోస్టర్ సూచిస్తోంది.
స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్ ఘన విజయానికి నాలుగేళ్ల తర్వాత, ఈ చిత్రం పీటర్ పార్కర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని చూపించనుంది. ప్రపంచం తనను గుర్తించని పరిస్థితుల్లో ఒంటరిగా జీవిస్తున్న పీటర్, న్యూయార్క్ నగరాన్ని రక్షించడమే తన ధ్యేయంగా మారుతుంది. కానీ కొత్త నేరాల పరంపరతో పాటు అతని జీవితాన్ని కుదిపేసే శక్తివంతమైన శత్రువు రంగంలోకి దిగడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది.
సోనీ పిక్చర్స్ సంస్థ ఇండియా  ఈ చిత్రాన్ని భారతదేశవ్యాప్తంగా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయనుంది.
