సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By pnr
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (11:15 IST)

వేసవికాలంలో బెట్ట (వేడి) జలుబు ఎందుకు చేస్తుంది?

చాలా మందికి వేసవికాలంలో బెట్ట జలుబు చేస్తుంది. శీతాకాలంలో లాగానే వేసవి కాలంలోనూ తీవ్రమై జలుబు చేస్తుంది. మండుటెండల్లో ఈ జలుబు ఎందుకు చేస్తుందో తెలియదు. ఒకవైపు ఎండవేడి.. మరోవైపు ఉక్కపోతతో పాటు ఇంకోవైపు

చాలా మందికి వేసవికాలంలో బెట్ట జలుబు చేస్తుంది. శీతాకాలంలో లాగానే వేసవి కాలంలోనూ తీవ్రమై జలుబు చేస్తుంది. మండుటెండల్లో ఈ జలుబు ఎందుకు చేస్తుందో తెలియదు. ఒకవైపు ఎండవేడి.. మరోవైపు ఉక్కపోతతో పాటు ఇంకోవైపు బెట్ట జలుబు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతారు. 
 
అయితే, వేసవి కాలంలో వేడి జలుబు రావడానికి కారణమేంటో తెలుసుకుందాం.. వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్ ఫ్లూయెంజా రకాలతో పాటు ఎంటెరో వైరస్‌లు సంక్రమిస్తాయి. చలికాలంలో సంక్రమించే వైరస్‌ల కన్నా ఇవి మరింత ప్రభావంతంగా ఉంటాయి. వీటి వల్ల జలుబు లక్షణాలే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులు, డయేరియా, తలనొప్పి, విపరీతమైన దగ్గు వంటి కూడా వస్తాయి. 
 
అందువల్ల మందులు వాడినా కూడా ఎక్కువ రోజుల పాటు జలుబు కొనసాగే అవకాశాలు ఎక్కువ. వేడి జలుబుతో పాటు గొంతులో మంట, ముక్కులో శ్లేష్మం కూడా మంటగా ఉండటం జరుగుతుంది. తలనొప్పి కూడా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో చల్లదనం కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లడం, ఏసీలను వినియోగించడం వంటి కారణాలతో వేడి జలుబు వైరస్ విస్తరించే అవకాశాలు ఎక్కువ. అందువల్ల పడక గదితో పాటు.. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి.