శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (11:23 IST)

గర్భంతో ఉన్నారా? ''డి'' విటమిన్ తప్పకుండా అవసరం..

గర్భంతో ఉండే తల్లులు చక్కటి పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కటి ఆరోగ్యంతో పెరుగుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు విటమిన్‌ 'డి'ని ఎక్కువగా తీసుకోవాలని, దీనివల్ల పుట్

గర్భంతో ఉండే తల్లులు చక్కటి పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కటి ఆరోగ్యంతో పెరుగుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు విటమిన్‌ 'డి'ని ఎక్కువగా తీసుకోవాలని, దీనివల్ల పుట్టబోయే బిడ్డలు కూడా చక్కగా ఎముకల పటుత్వంతో పుడతారని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు , ఆకుకూరలు , పప్పు , మాంసము , చేపలు వగైరా తీసుకోవాలి. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం జరుగుతుంది.
 
శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో గర్భిణుల శరీరంలో విటమిన్‌ డి గనుక పుష్కలంగా ఉంటే వారికి పుట్టే పిల్లలు కూడా చక్కటి ఎముకల పటుత్వాన్ని కలిగి ఉంటారని తేలింది. తల్లి శరీరంలో విటమిన్‌ డి పరిమాణం తక్కువగా ఉంటే వారికి పుట్టే పిల్లలు దుర్భలమైన ఎముకలు, కండరాలను కలిగివుంటారని ఈ పరిశోధనలో తేలింది.
 
అయితే గర్భంతో ఉన్న తల్లుల శరీరంలోని విటమిన్‌ డి స్థాయులకు, పుట్టిన తర్వాత పిల్లల్లో పటుత్వానికి మధ్య సంబంధం ఏమిటి? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని పరిశోధకులు అంటున్నారు.