వేడినీటిని తాగండి.. బరువు తగ్గండి.. కేశాలకు, చర్మానికి కూడా..?
వేడినీటిని తీసుకోవడం ద్వారా అనసరంగా బరువు పెరగడం, ఒబిసిటీకి గురవడం జరగదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని త్రాగడం వలన వైద్యుడిని సంప్రదించే అవకాశమే రాదని వారు చెప్తున్నారు. ఉదయమే నిద్రలేచి ఒ
వేడినీటిని తీసుకోవడం ద్వారా అనసరంగా బరువు పెరగడం, ఒబిసిటీకి గురవడం జరగదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని తాగడం వలన వైద్యుడిని సంప్రదించే అవకాశమే రాదని వారు చెప్తున్నారు. ఉదయమే నిద్రలేచి ఒకటి లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు తాగాలి. వేడి నీటిని మెల్లగా తాగాలి. ఒకేసారి తాగేయకూడదు.
వేడినీటిని తాగడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. కీళ్ళ నొప్పులుండవు ఉదరానికి మేలు చేకూరుతుంది. గొంతు సమస్యలు రానేరావు. దగ్గు, జలుబు వంటి సమస్యలుండవ్. రోజుకు ఏడు నుంచి 8 గ్లాసుల వేడినీటిని తాగడం ద్వారా చర్మానికి, జుట్టుకు కూడా మేలు జరుగుతుంది. వేడి నీటిని తాగడం ద్వారా తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
మెటబాలిజం పనితీరు మెరుగు అవుతుంది. ఇంకా వేడినీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే.. బరువు తగ్గుతారు. వేడి నీటిని తాగడం ద్వారా రక్తప్రసరణ మెరుగవుతుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. కేశాలకు బలం ఇస్తుంది. చర్మానికి కాంతినిస్తుంది. చుండ్రును దూరం చేస్తుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.