గుండెను పదిలం చేసే చిక్కుడు..
చిక్కుడు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. నరాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం ద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. చిక
చిక్కుడు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. నరాలు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం ద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. చిక్కుడులోని ఐరన్.. శరీరంలో ఎరుపు రక్త కణాలను ఉత్పత్తి చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిక్కుడులో పొటాషియం, విటమిన్ ఎ, సి, నీటి శాతం, పీచు పుష్కలంగా ఉన్నాయి.
ఇవి శరీరంలో నీటిని, ఆమ్లాల శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పీచు అజీర్తికి చెక్ పెడుతుంది. గర్భం దాల్చిన మూడు నెలల పాటు చిక్కుడును తీసుకుంటే.. గర్భస్థ శిశువు మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే శరీరంలోని ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చిక్కుడులోని క్యాల్షియం ఎంతో మేలు చేస్తుంది.
హార్మోన్లకు శక్తినిచ్చి చురుకుగా ఉండేలా చేసే చిక్కుడు కాయను రోజూవారీ డైట్‌లో కప్పు మోతాదులో తీసుకుంటే ఒత్తిడి దూరమవుతుంది. నిద్రలేమిని దూరం చేసి.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని పోషకాలు క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. ఒబిసిటీ, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.