మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (17:44 IST)

చికెన్ తింటున్నారా? కోడి మెడను, రెక్కల్ని మాత్రం పక్కనబెట్టేయండి..

చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగట్లేదా? కోడి కూర, లేదా ఇతరత్రా వెరైటీలు టేస్టీగా వండిపెడితే లాగించేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. చికెన్ ముక్కలు ఏవి పడితే అవి తినకుండా మెడ, రెక్కల భాగాలను తినడం మానేయాలని

చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగట్లేదా? కోడి కూర, లేదా ఇతరత్రా వెరైటీలు టేస్టీగా వండిపెడితే లాగించేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. చికెన్ ముక్కలు ఏవి పడితే అవి తినకుండా మెడ, రెక్కల భాగాలను తినడం మానేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. కోడి బలిసేందుకు.. కోడి బరువు తక్కువ కాలంలో పెరగాలనే నెపంతో.. కోళ్లకు ఇంజక్షన్ వేస్తారని అందరికి తెలిసిందే. వారి లాభాల కోసం కోళ్లకు స్టెరాయిడ్స్‌ను ఇంజక్షన్ రూపంలో ఇవ్వటం వల్ల, చికెన్ తినే వారి ఆరోగ్యానికి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కోడి పెరుగుదల కోసం, కోడి మెడ, రెక్కలపై స్టెరాయిడ్స్‌ను ఇస్తుంటారు. దీని ప్రభావం కోడి మిగతా భాగాల కంటే ఈ రెండు భాగాలపైనే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెండు భాగాలను తినకుండా పక్కనబెట్టడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం ద్వారా హార్మోన్ల విడుదలలో తేడా జరుగుతుందని.. తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. 
 
ఇవి బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తాయని, అవి మెల్ల మెల్లగా క్యాన్సర్ కారకాలుగా మారుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో స్టెరాయిడ్స్ ప్రభావం గర్భాశయ సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత చికెన్ తినే ముందు.. కోడి మెడను రెక్కలను పక్కనబెట్టేస్తే.. అనారోగ్య సమస్యలకు దూరం కావొచ్చునని వారు సలహా ఇస్తున్నారు.