కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, తేనె కలిపి స్నానం చేస్తే?

వేసవిలో దాహార్తిని తీర్చుకోవాలంటే.. కొబ్బరి బొండాలు బాగా పనిచేస్తాయి. ఇవి సౌందర్య పోషణలోనూ బాగా పనిచేస్తాయి. చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరిబొండాం నీళ్లలో మెండుగా ఉంది. వేసవికాలంలో ప్రతి

Written By selvi
Updated: ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (17:05 IST)
వేసవిలో దాహార్తిని తీర్చుకోవాలంటే.. కొబ్బరి బొండాలు బాగా పనిచేస్తాయి. ఇవి సౌందర్య పోషణలోనూ బాగా పనిచేస్తాయి. చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరిబొండాం నీళ్లలో మెండుగా ఉంది. వేసవికాలంలో ప్రతిరోజు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 
అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది. వేసవిలో చెమటతోపాటు చర్మంపై పేరుకుపోయే మురికివల్ల మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కుల నిమ్మరసం కలిపి పదినిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.
 
చిక్కటి కొబ్బరిపాలలో కొన్ని తేనె చుక్కలు, రెండు టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే మృదువైన పాదాలు సొంతమవుతాయి.

అన్నీ చూడండి

పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఆందోళన చేస్తాం : సీజీపీ

రెండోసారి కూడా ఆడబిడ్డ.. నీటి సంపులో పడేసి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

నీట్ వరుస లోపాలకు ముగింపు పలకాలి.. సుప్రీం కోర్టు ఆదేశాలు

ఇక ప్రశ్నపత్రాల లీకేజీ పాల్పడితే జీవితాంతం జైలే : చట్ట సవరణపై కేంద్రం దృష్టి

అన్నీ చూడండి

జన నాయగన్ చిత్రం నుంచి నా సన్నివేశాన్ని తీసేసారు: గద్గద స్వరంతో నటి ఆనంది

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments