వంటకు ఈ నూనెలు మంచివే... పామ్ ఆయిల్ వినియోగం మోతాదుకు మించితే?
వంటకు ఉపయోగించే నూనెల ద్వారానే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ కాంతిని మెరుగుపరిచే పోషకాలు రైస్ బ్రాన్‌లో
వంటకు ఉపయోగించే నూనెల ద్వారానే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ కాంతిని మెరుగుపరిచే పోషకాలు రైస్ బ్రాన్‌లో ఉంటాయి. అలాగే ఆలివ్ ఆయిల్... అల్జీమర్స్, పార్కిన్‌సన్ వంటి నాడీమండల వ్యాధుల్ని రాకుండా కాపాడుతుంది. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది.
వేరుశనగ నూనె శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్చుంది. హృద్రోగాలు, క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడే ఒమెగా-3 ప్యాటీ ఆసిడ్స్ వేరుశనగ నూనెలో పుష్కలంగా ఉన్నాయి. పొద్దుతిరుగుడు గింజల నూనె వాడకం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులు రాకుండా నయం చేస్తుంది. నూనెలోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. కొలోన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఇక కొబ్బరి నూనె చెడు బ్యాక్టీరియాను తరిమేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందించి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
ఇక పామ్ ఆయిల్ సంగతికి వస్తే.. కెరోటిన్.. విటమిన్-ఇలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు పామ్ ఆయిల్‌లో పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించే గుణం ఇందులో ఎక్కువ. క్యాన్సర్, అల్జీమర్స్, ఆర్థరైటిస్ బాధితులకు పామ్ ఆయిల్ మంచిది. అయితే మోతాదుకు మించి వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హై-ఫ్యాట్స్ ఈ ఆయిల్‌లో ఉండటం ద్వారా మోతాదుకు మించి వాడితే ఒబిసిటీ తప్పదు.