ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (12:11 IST)

హడావుడిగా తినొద్దు.. భోజనానికి 20 నిమిషాలైనా కేటాయించండి

ఉద్యోగాలకు వెళ్తున్నారా? టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నారా? ఒకవేళ తిన్నా హడావుడిగా తింటున్నారా? అయితే కాస్త ఆగండి. ఏదో తొందరలో అల్పాహారాన్ని, మధ్యాహ్నం ఆఫీసు పని ఒత్తిడిలో ఏదో భోజనం చేశామని.. ఏదో అయిపి

ఉద్యోగాలకు వెళ్తున్నారా? టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నారా? ఒకవేళ తిన్నా హడావుడిగా తింటున్నారా? అయితే కాస్త ఆగండి. ఏదో తొందరలో అల్పాహారాన్ని, మధ్యాహ్నం ఆఫీసు పని ఒత్తిడిలో ఏదో భోజనం చేశామని.. ఏదో అయిపించేశాం అనుకుంటే.. అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు  ఆరోగ్య నిపుణులు. ఎన్ని పనులున్నా ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలని.. హడావుడిగా తినడం చేయకూడదని వారు చెప్తున్నారు. 
 
అల్పాహారం తీసుకోవడం కుదరకుంటే, రకరకాల పండ్లు, శాండ్ విచ్ వంటివి తీసుకోవచ్చు. కడుపును ఏ మాత్రం ఖాళీగా ఉంచకుండా బాదం పప్పులు వంటివి తింటే తక్షణ శక్తి అందుతుంది. ఇక మధ్యాహ్న భోజనం వేగంగా తినకుండా.. భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయిస్తే మంచిది. 
 
వేగంగా తినేస్తే, ఆపై శరీరంపై ఒత్తిడి పడుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తీసుకుంటే.. తగిన పోషకాలు శరీరానికి అందవు. అందుకే సమయానికి భోజనం పూర్తిచేయాలి. అలా చేయకుంటే, రక్తంలో చక్కెర శాతం పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.