ఆదివారం, 27 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (12:02 IST)

మాంసాహారం-ఆకుకూరలు తినండి.. దంతాలను మెరుగుపరుచుకోండి

మాంసాహారంతో పాటు ఆకుకూరలు వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. వీటి ద్వారా దంత సంరక్షణ సులభం అవుతుంది. అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూర

మాంసాహారంతో పాటు ఆకుకూరలు వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన  విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. వీటి ద్వారా దంత సంరక్షణ సులభం అవుతుంది. అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో.. ఈ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి.. దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
మాంసాహారంతో ఫాస్పరస్ అందడం ద్వారా దంతాలు దృఢపడతాయి. మాంసం, చేపలు, టోఫు తినడం మంచిది. ఇవి తీసుకోవడం వల్ల అత్యవసరమైన ఖనిజాలు అంది. పళ్లపై ఉండే ఎనామిల్‌ కూడా గట్టిపడుతుంది. దాంతోపాటు అతి పుల్లగా ఉండే పదార్థాలూ, గట్టిగా ఉండే వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. 
 
అలాగే పాల పదార్థాల్లో ఉండే ప్రోటీన్లు కూడా దంతాల ఆరోగ్యానికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎనామిల్‌ పూత పోకుండా సాయపడతాయి. కొవ్వు తక్కువగా ఉన్న చీజ్‌ ఎంచుకోవాలి. అలానే వెన్నలేని పాలతో చేసిన పెరుగు తినాలి. క్యాల్షియం ఎక్కువగా ఉండే కోడిగుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. గుడ్డులోని సొన దంతాలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. చిన్నారులకు ఇవ్వడం వల్ల దంతాలతోపాటు, ఎముకలూ బలంగా మారతాయని వారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.