బీపీ, కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. గ్రీన్ ఆపిల్ తినండి
గ్రీన్ ఆపిల్‌లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థ లోపాల నుండి ఉపశమనం, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం, బిపి తగ్గించటం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం, ఆకలి మందగించడం వంటి
గ్రీన్ ఆపిల్‌లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థ లోపాల నుండి ఉపశమనం, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం, బిపి తగ్గించటం, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం, ఆకలి మందగించడం వంటి వాటికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎక్కువ పైబర కంటెంట్, దీనిలో పైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపర్చటానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది.
ఆపిల్‌ను దాని చర్మంతో సహా తినడం చాలా మంచిది. ఇలా చేస్తే ప్రేగు, వ్యవస్థలను శుభ్రపరుస్తుంది. ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం మొదలైన ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఆపిల్‌లో ఉన్న ఇనుము రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.తక్కువ కొవ్వు కంటెంట్, బరువుతగ్గాలని అనుకునే వారికి ఇది చాలా సహకరిస్తుంది.
గుండెకు రక్తాన్ని సక్రమంగా ప్రసరింపజేయడంలో ఆపిల్‌లోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది చర్మ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది, దీనిలో విటమిన్ సి ఉండటంవల్ల ప్రీ రాడికల్స్‌ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. అందువల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.